వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : సింగరేణి మైనర్స్ & ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ హెచ్ ఎం స్ బెల్లంపల్లి ఏరియా ఆర్గనైజర్‌గా గోలేటి సీహెచ్‌పీలో పనిచేస్తున్న ఏంబడి ప్రశాంత్ నియమితులయ్యారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రియాజ్ ఆదేశాల మేరకు, ఏరియా వైస్ ప్రెసిడెంట్ పతెం రాజబాబు ఈ నియామక ఉత్తర్వులను జారీ చేశారు.కార్మిక సంక్షేమం,యూనియన్ బలోపేతమే ధ్యేయంగా ప్రశాంత్ ఈ బాధ్యతల్లో కొనసాగనున్నారు. ఏంబడి ప్రశాంత్ నియామకం పట్ల హెచ్.ఎమ్.ఎస్ బ్రాంచ్ సెక్రటరీ ఎం. శివారెడ్డి, సెంట్రల్ నాయకులు ఎండి. ఓజియర్, సెంట్రల్ ఆర్గనైజర్ ఎస్.కె. ఇనూస్, మరియు ఏరియా ఆర్గనైజర్ కళ్యాణ్ కుమార్ ప్రత్యేక హర్షం వ్యక్తం చేశారు.అలాగే పీట్ సెక్రెటరీ ఎండి. ఆరీఫ్, ఆర్గనైజర్లు దశరథం, మహేష్, బాలేష్, రాజేష్, దీపక్ రాజ్ తదితరులు ప్రశాంత్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ, ఆయన నాయకత్వంలో యూనియన్ మరింత ముందుకు సాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Admin
వాస్తవ గమ్యం