వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావును ఎదుర్కొనే ధైర్యం లేకే మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వైవీ వంశీకృష్ణ వర్గీయులు వర్గపోరుకు తెరలేపుతున్నారని మేయర్ ధరణి మధుకర్, మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు తూముల నరేష్, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు పూదరి తిరుపతి ఆరోపించారు. ఎమ్మెల్యే నివాసంలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్మోహన్రావు వర్గం తీరును కాంగ్రెస్ అధిష్ఠానానికి, పీసీసీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎంపీ ల్యాడ్స్ నిధులను అన్ని డివిజన్లకు సమానంగా కేటాయించాలని కోరారు. కాంగ్రెస్ కోసం ప్రేమ్ సాగర్ రావు చేసిన సేవలను వారు వివరించారు.
Reporter
వాస్తవ గమ్యం