వాస్తవ గమ్యం / తెలంగాణ / హైదరాబాదు : హైదరాబాద్: రహస్య డేటింగ్, వివాహేతర సంబంధాలకు వేదికైన ఒక విదేశీ యాప్ వినియోగంలో హైదరాబాద్ దేశంలోనే టాప్-5లో నిలిచింది. దేశవ్యాప్తంగా 5 లక్షల మంది యూజర్లు ఉండగా, ఒక్క హైదరాబాద్‌లోనే 1.10 లక్షల మంది ఉన్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. ముఖ్యంగా గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్ ప్రాంతాల నుంచే 60 శాతం ట్రాఫిక్ వస్తుండటం గమనార్హం. ఈ యూజర్లలో 68 శాతం మంది 25-40 ఏళ్ల వారే కావడం విశేషం. కొత్త సబ్‌స్క్రైబర్ల నమోదులో భారత్ ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉందని ఆ సంస్థ తెలిపింది
Reporter
వాస్తవ గమ్యం