వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : ఆసిఫాబాద్, కొమరం భీమ్, అసిఫాబాద్,అంగన్ మిలన్ సేవా కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అరిగెల మల్లికార్జున్ యాదవ్,సమాజాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ నిరంతరం ప్రజలకు సేవలందిస్తున్న అంగన్వాడీ టీచర్లు, ఆయాల సేవలు అభినందనీయమని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అరిగెల మల్లికార్జున్ యాదవ్ అన్నారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని బాపూనగర్‌లో ఉన్న ఆయన కార్యాలయంలో అంగన్ మిలన్ సేవా కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ టీచర్లు, ఆయాలను ఘనంగా సన్మానించి వారి సేవలను కొనియాడారు.ఈ సందర్భంగా అరిగెల మల్లికార్జున్ యాదవ్ మాట్లాడుతూ.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని నెల రోజులపాటు సమాజానికి వివిధ రంగాల్లో సేవలందిస్తున్న వారిని గుర్తించి, గౌరవించాలనే ఉద్దేశంతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజా సేవకు అంకితమైన వ్యక్తులను సత్కరించడం ద్వారా వారి సేవలను సమాజానికి పరిచయం చేయడంతో పాటు, మరింత మందికి సేవా స్ఫూర్తిని కలిగించవచ్చన్నారు.అంగన్వాడీ టీచర్లు, ఆయాలు గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యం, పోషణ విషయంలో ఎంతో కీలకమైన బాధ్యతలను నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. చిన్నారులకు పోషకాహారం అందించడంతో పాటు, తల్లులు మరియు పిల్లల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నారని ప్రశంసించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు చేరవేయడంలోనూ అంగన్వాడీ సిబ్బంది పాత్ర ఎంతో ముఖ్యమన్నారు.గ్రామాల అభివృద్ధికి పరిసరాల పరిశుభ్రత, ప్రజల ఆరోగ్యం, సామాజిక బాధ్యత ఎంతో అవసరమని తెలిపారు. ప్రతి ఒక్కరూ పరిశుభ్రతకు ప్రాధాన్యతనిస్తూ, తమ కుటుంబాల ఆర్థిక అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందితే గ్రామాలు కూడా ప్రగతి సాధిస్తాయని పేర్కొన్నారు. సమాజ సంక్షేమం కోసం అంకితభావంతో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్లు, ఆయాల సేవలను గుర్తించి సన్మానించడం సంతోషంగా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు సుంకరి పెంటన్న, ఆసిఫాబాద్ పట్టణ బీజేపీ అధ్యక్షుడు ఆకుల సంతోష్, బీజేపీ యువ నాయకుడు గాజుల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం