Sunday, 13 September 2026 08:38:04 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

నస్పూర్ వెంకటేశ్వర ఆలయం ముందు వీధి కుక్కల దాడి చిన్నారికి గాయాలు

Date : 17 July 2026 09:30 AM Views : 67

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల జిల్లా నస్పూర్ పట్టణంలోని సుందరయ్య కాలనీ వెంకటేశ్వర ఆలయం ముందు శుక్రవారం ఉదయం స్కూల్‌కు వెళ్తున్న ఓ చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేసి గాయపరిచాయి. స్థానికుల కథనం ప్రకారం, ఉదయం పాఠశాలకు వెళ్తున్న సమయంలో ఆలయం సమీపంలో సంచరిస్తున్న కుక్కలు ఒక్కసారిగా చిన్నారిపై దాడి చేశాయి. స్థానికులు వెంటనే స్పందించి కుక్కలను తరిమివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. గాయపడిన చిన్నారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.నస్పూర్ పట్టణంలోని వెంకటేశ్వర ఆలయం పరిసరాలు, పాఠశాలలు, ప్రధాన రహదారుల వద్ద వీధి కుక్కల సంచారం రోజురోజుకు పెరుగుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో చిన్నారులు, వృద్ధులు బయటకు రావాలంటే భయపడే పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు.ఈ ఘటన నేపథ్యంలో మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి వీధి కుక్కల నియంత్రణకు చర్యలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా పాఠశాలలు, ఆలయాలు, జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు తీసుకుని కుక్కలను పట్టి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, లేకపోతే మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు హెచ్చరిస్తున్నారు.

KAGITHAPU SRINIVAS

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: