Friday, 11 September 2026 01:46:45 PM
# జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు # మందమర్రి లో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు.

​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం:

ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ తీర్పు

Date : 31 July 2026 04:53 PM Views : 1019

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి మండలంలోని సర్వే నంబర్ 350 లో ఉన్న ఏజెన్సీ (షెడ్యూల్డ్) భూమిని ఆక్రమించి అక్రమంగా నిర్మించిన ఫంక్షన్ హాల్‌తో సహా సదరు భూమిని తక్షణమే ప్రభుత్వ స్వాధీనం చేసుకోవాలని ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ మరియు అదనపు ఏజెంట్ తీర్పు వెలువరించారు.గిరిజన భూమిని నాన్-గిరిజనులు ఆక్రమించి ఫంక్షన్ హాల్ నిర్మించారని 'ఆదివాసీ నాయకపోడ్ సేవా సంఘం' ప్రతినిధులు గతంలో ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన ఉట్నూర్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గతంలోనే సదరు నాన్-గిరిజనుడిని భూమి నుంచి ఖాళీ చేయించాలని ఆదేశించారు.ఈ ఆదేశాలను సవాలు చేస్తూ అప్పీలుదారుడు దాఖలు చేసిన పిటిషన్‌ను ఉన్నతాధికారులు విచారించారు.గత 70 ఏళ్ల పహాణీ రెవెన్యూ రికార్డుల్లోనూ ఎక్కడా అప్పీలుదారుడి పేరు లేదని, ఏజెన్సీ చట్టం (1/1970 రెగ్యులేషన్) అమలులోకి వచ్చిన తర్వాత నాన్-గిరిజనులు చేసిన కొనుగోళ్లు చెల్లవని స్పష్టం చేశారు. అలాగే మున్సిపాలిటీ అనుమతి లేకుండానే ఫంక్షన్ హాల్ నిర్మాణం చేపట్టారని నిర్ధారించారు.అప్పీలుదారుడి వాదనల్లో ఎలాంటి ఆధారం లేకపోవడంతో అప్పీల్‌ను కొట్టివేస్తూ, ఆ భూమిని మరియు నిర్మాణాలను వెంటనే స్వాధీనం చేసుకోవాలని మందమర్రి తహసీల్దార్‌కు ఉత్తర్వులు జారీ చేశారు.దీనికి జిల్లా అధ్యక్షులు పెద్ది భార్గవ్ కి సంఘము తరపున సభ్యులు కృతజ్ఞతలు తెలియచేసినారు.....

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :