వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : తెలంగాణలోని ఏజెన్సీ గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న పెసా మొబిలైజర్లు, జిల్లా కోఆర్డినేటర్లకు ఇకపై ప్రతి నెలా IFMS ద్వారా వేతనాలు చెల్లించేలా ప్రభుత్వం జీవో ఆర్టీ నం. 1475ను జారీ చేసింది.ఈ నిర్ణయంతో సకాలంలో వేతనాలు అందే మార్గం సుగమం కావడంతో, తమ చిరకాల డిమాండ్‌ను నెరవేర్చినందుకుగాను సీఎం రేవంత్ రెడ్డి, పంచాయతీ రాజ్ మంత్రి సీతక్కకు పెసా ఉద్యోగులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలో జరిగిన ఈ కార్యక్రమంలో మెస్రం జంగు, మెస్రం తానాజీ, పూసం భీమ్రావు తదితరులు పాల్గొని హర్షం వ్యక్తం చేశారు.
Reporter
వాస్తవ గమ్యం