వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి పల్లకి సేవ కార్యక్రమంలో ఆసిఫాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి అజ్మీర శ్యామ్ నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి భక్తులతో కలిసి ఆయన పల్లకిని మోసి, మణికంఠునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయ్యప్ప స్వామి నామస్మరణలు, భక్తుల శరణుఘోషల మధ్య పల్లకి సేవ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో సాగింది.స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. పల్లకి సేవతో జిల్లా కేంద్రంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తులు స్వామివారికి మొక్కులు చెల్లించుకుని ఆశీస్సులు పొందారు.
Reporter
వాస్తవ గమ్యం