వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : గిరిజన ముద్దుబిడ్డ, ఆదివాసీ తొలి పట్టభద్రుడు, మాజీ గిరిజన శాఖ మంత్రి వర్యులు, తన తండ్రి అయిన స్వర్గీయ శ్రీ కోట్నక భీం రావు గారి 24 వ వర్ధంతి సందర్భంగా ఆసిఫాబాద్ శాసన సభ్యురాలు శ్రీమతి కోవ లక్ష్మీ గారు శనివారం ఆసిఫాబాద్ లోని కోట్నక భీం రావు చిల్డ్రన్ పార్క్ లో ఘన నివాళులు అర్పించారు.తండ్రి విగ్రహానికి పూలమాల వేసి, భావోద్వేగంతో నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ "నాన్న చూపిన బాటలోనే నడుస్తూ, ఆదివాసీల అభివృద్ధి కోసం కృషి చేస్తాను. ఆయన ఆశయ సాధనే నా లక్ష్యం" అని అన్నారు.ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధువులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు , ఆదివాసీ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం