వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : శ్రీరాంపూర్/జైపూర్ మండలంలోని ఇందారం 1ఏ గని మేనేజర్ కోటయ్య కార్మికుల పట్ల అనుసరిస్తున్న నిరంకుశ వైఖరిని మార్చుకోవాలని (హింద్ మజ్దూర్ సభ) యూనియన్ డిమాండ్ చేసింది. కార్మికులను అసభ్య పదజాలంతో దూషించడం,చిన్న చిన్న కారణాలకే సస్పెన్షన్లు, చార్జిషీట్లు ఇస్తూ మానసిక వేధింపులకు గురిచేయడం తగదని యూనియన్ నాయకులు మండిపడ్డారు.గనిలో కనీస సౌకర్యాలు కల్పించడంలో మేనేజ్మెంట్ విఫలమైందని నాయకులు విమర్శించారు. ప్రధానంగా గనిలో ఎదురవుతున్న ఇబ్బందులను ఈ విధంగా వివరించారు.మొదటి షిఫ్ట్ కార్మికులను మధ్యాహ్నం 3 గంటల వరకు గని లోపలే ఉండాలని బలవంతం చేయడం.16 చేతి కుక్కులు ఉండాల్సిన చోట కేవలం 5 మాత్రమే ఉండటం, అవి కూడా నాణ్యత లేనివి కావడం.కార్మికులకు నాణ్యమైన చేతి గ్లౌజులు సరఫరా చేయకపోవడం.గని లోపల త్రాగునీరు, సరైన వెంటిలేషన్ మరియు మరుగుదొడ్ల సౌకర్యం లేకపోవడం వల్ల కార్మికులు నరకయాతన అనుభవిస్తున్నారు.టబ్బు క్లీనింగ్ చేసేవారిని,కేబుల్ బాయ్‌లను ఇతర పనులకు మళ్లించడం వల్ల పని భారం పెరుగుతోంది.మేనేజర్ కోటయ్య కార్మికుల సమస్యలను వినకుండా అవమానిస్తూ వెనక్కి పంపుతున్నారని, యూనియన్ మీటింగ్స్ జరగకుండా ఓవర్‌మెన్ల ద్వారా ఒత్తిడి తెస్తున్నారని నాయకులు ఆరోపించారు. ఈ సమస్యలన్నింటిపై ఆపరేషన్ అధికారి మీస నాగన్నకు (హెచ్ ఎం స్) నాయకులు వినతి పత్రం సమర్పించారు. తక్షణమే మేనేజర్‌పై చర్యలు తీసుకోవాలని, సమస్యలను పరిష్కరించాల కోరారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు తిప్పారపు సారయ్య, శ్రీరాంపూర్ వైస్ ప్రెసిడెంట్ వంటకాల అనిల్ రెడ్డి, నాయకులు దుర్గ ప్రసాద్, శ్రీనివాస్, రమేష్ మరియు పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.
Admin
వాస్తవ గమ్యం