Friday, 11 September 2026 02:47:39 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

*కానిస్టేబుల్ నోటిఫికేషన్‌లో ఏజెన్సీ ప్రాంత అభ్యర్థులకు 75% రిజర్వేషన్ అమలు చేయాలి

Date : 19 August 2026 03:27 PM Views : 96

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : వాస్తవ గమ్యం : ఆగస్ట్ 19 కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ యు కానిస్టేబుల్ నియామక నోటిఫికేషన్‌లో జీవో నంబర్ 109 ప్రకారం ఏజెన్సీ ప్రాంత అభ్యర్థులకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలని రాష్ట్ర ఏజెన్సీ బంద్ పిలుపు మేరకు బుధవారం జైనూర్ మండలంలో ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో విద్యాసంస్థలు, వ్యాపార సంస్థలు, దుకాణాలను స్వచ్ఛందంగా పూర్తిస్థాయిలో బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివాసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు మధురాజ్ మడావి మాట్లాడుతూ, ఏజెన్సీ ప్రాంతంలో విద్య, ఉద్యోగ నియామకాల్లో స్థానిక ఆదివాసీ అభ్యర్థులకు ప్రత్యేక రిజర్వేషన్‌ను పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా పోలీస్ కానిస్టేబుల్ నియామక నోటిఫికేషన్‌లో ఏజెన్సీ ప్రాంత ఆదివాసీ అభ్యర్థులకు 75 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా ఆదివాసీ నిరుద్యోగ యువతకు న్యాయం జరిగేలా జీవో నంబర్ 3ను పునరుద్ధరించాలని, ఏజెన్సీ ప్రాంత హక్కులను కాపాడేందుకు 1/70 చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఏజెన్సీ ప్రాంత ప్రజల హక్కులు, విద్యార్థులు మరియు నిరుద్యోగ యువత భవిష్యత్తు కోసం చేపట్టిన ఈ బంద్‌కు విద్యాసంస్థలు, వ్యాపారులు, ప్రజలు సహకరించి విజయవంతం చేశారని తెలిపారు.

Kumram jangu

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :