వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి, జూలై 27: మందమర్రి మున్సిపాలిటీ పరిధిలోని దీపక్ నగర్ అర్బన్ హెల్త్ సెంటర్‌లో ఆదివారం జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ టి. రాజలింగు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన 0 నుంచి 5 సంవత్సరాల లోపు చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా కమిషనర్ టి. రాజలింగు మాట్లాడుతూ, "0 నుంచి 5 సంవత్సరాల లోపు ప్రతి చిన్నారికి రెండు పోలియో చుక్కలు వేయించడం ద్వారా జీవితాంతం పోలియో వ్యాధి నుంచి రక్షణ లభిస్తుంది. చిన్నారుల ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు తప్పనిసరిగా తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని" కోరారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ జాహ్నవి, మెడికల్ ఆఫీసర్, అర్బన్ హెల్త్ సెంటర్ దీపక్ నగర్ వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు, ఇన్‌చార్జి టౌన్ మిషన్ కోఆర్డినేటర్ ఏ. రఘురాం, మెప్మా సిబ్బంది, రిసోర్స్ పర్సన్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వైద్య ఆరోగ్య సిబ్బందికి, ఆశా వర్కర్లకు, ప్రజాప్రతినిధులకు మున్సిపల్ కమిషనర్ టి. రాజలింగు కృతజ్ఞతలు తెలిపారు
Reporter
వాస్తవ గమ్యం