వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : వాస్తవ గమ్యం: జైనూర్ మండలం లోని పావుర్ గూడా గ్రామ పంచాయతీకి చెందిన అనక లక్ష్మీబాయి అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషాదకర విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ తొడసం రాజేందర్ వెంటనే మృతురాలి నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు ఈ సందర్భంగా మృతురాలి కుటుంబానికి తన వంతు సహాయంగా రూ.3,000 వేలు నగదు ఆర్థిక సాయం అందజేశారు. కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు సర్పంచ్ తొడసం రాజేందర్‌తో పాటు గ్రామస్థులు కూడా మృతురాలి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారి కుటుంబానికి ధైర్యం చెప్పి, అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.
Reporter
వాస్తవ గమ్యం