Tuesday, 28 July 2026 03:24:56 PM
# తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ – పచ్చని ఎదులపాడ్ నిర్మాణమే లక్ష్యం # కీ॥శే. శ్రీ సంత్ కుమ్ర దేవ్ రావు మహారాజ్ మాడిస్ పూజలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క # నీట్ పేపర్ లీకేజీ బాధిత విద్యార్థులకు కొవ్వొత్తుల ర్యాలీలో నివాళి # మద్యం మత్తులో బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటన # కోదండ రామాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తుల ప్రత్యేక పూజలు # *మాజీ ఎమ్మెల్యే ఆత్రంసక్కు చొరవతో షేడ్ నిర్మాణానికి భూమిపూజ* # *ఆశ్రమ పాఠశాలలో స్మాట్ బోర్డ్ ప్రారంభించిన స్థానిక సర్పంచ్ జనేరావు. # కేటీఆర్ జన్మదినం.. సేవా కార్యక్రమాలతో బీఆర్ఎస్ నేతల వినూత్న వేడుకలు # ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ గడువులోగా పూర్తి చేయాలి: # అభివృద్ధి పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలి: # సీఎంఆర్ బకాయిలను తక్షణమే పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్ వి. రాములు # జర్నలిస్టుల హక్కుల రక్షణే టీజేఏ దేయం # ప్రజల అభిమానాన్ని చూరగొన్న ధారావత్ శంకర్ నాయక్‌కు ఘన సన్మానం – భావోద్వేగ వీడ్కోలు* # ప్రజాస్వామ్యం మీద గౌరవం లేని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. # పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి. # చెన్నూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ పతాక దత్తత దినోత్సవం

సేవా పథంలో... నర్సుల కృషి అమూల్యం

Date : 12 May 2026 09:51 PM Views : 628

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : జైపూర్ మండల కేంద్రంలోని ఎస్టీపీపీ డిస్పెన్సరీలో అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ఈడి చిరంజీవి ముఖ్యఅతిథిగా హాజరై సేవాపథంలో నర్సుల కృషి అమూల్యమని పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఆధునిక నర్సింగ్ వ్యవస్థకు ఆద్యురాలైన ఫ్లోరెన్స్ నైటింగేల్ సేవలను స్మరించుకుంటూ, వైద్య రంగంలో నర్సులు "దేవదూతలు" అని కొనియాడారు. రోగుల పట్ల ప్రేమ, ఓర్పుతో వారు అందించే నిస్వార్థ సేవ అపారమైనదని, ముఖ్యంగా కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తెగించి పనిచేశారని ప్రశంసించారు. అనంతరం నైటింగేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి, కొవ్వొత్తులు వెలిగించి కేక్ కట్ చేశారు. ఇదే క్రమంలో ఉత్తమ సేవలందించిన సీనియర్ స్టాఫ్ నర్సు శ్రీమతి రాజమణిని ఈడీ చిరంజీవి శాలువాతో సన్మానించి ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో జీఎంలు ఎం. నరసింహారావు, ఎం. మదన్ మోహన్, ఏజీఎంలు సూర్యనారాయణ రాజు, పంతులా, ఫిట్ సెక్రెటరీ సత్యనారాయణ, మెడికల్ సూపరింటెండెంట్ బి. జానకి, వెంకటయ్య, మోహన్ సింగ్, రిటైర్డ్ డాక్టర్ ప్రభాకర్ తదితర అధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: