వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : తిర్యాని పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తూ ప్రజలతో స్నేహపూర్వకంగా మెలిగి, సేవాభావంతో విశేష గుర్తింపు పొందిన పోలీస్ సిబ్బంది ధారావత్ శంకర్ నాయక్ ఉద్యోగరీత్యా మరో ప్రాంతానికి బదిలీ కావడంతో ఆయనకు ఘనంగా సన్మానించి భావోద్వేగ వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా మంగి గ్రామ సర్పంచ్ వినోద్ మాట్లాడుతూ, శంకర్ నాయక్ తన విధులను ఎంతో నిబద్ధతతో నిర్వహిస్తూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేవారని, ఆయన సేవలను తిర్యాని ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని అన్నారు. కొత్త విధి స్థానంలో కూడా ఆయన మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ యువ నాయకుడు ఆర్కా చిన్ను, గ్రామ పటేల్ అచ్యుతరావు, హేతు మారావ్ తదితరులు పాల్గొని శంకర్ నాయక్‌ను శాలువాతో సన్మానించి జ్ఞాపిక అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమం భావోద్వేగ వాతావరణంలో సాగగా, పలువురు ఆయన సేవలను కొనియాడుతూ వీడ్కోలు పలికారు.
Reporter
వాస్తవ గమ్యం