వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : కొమరం భీమ్ఆసిఫాబాద్: యువతకు ఉజ్వల భవిష్యత్తును కల్పించడమే లక్ష్యంగా పోలీసు ఉద్యోగాల కోసం ప్రత్యేక కోచింగ్ అందిస్తున్నట్లు జిల్లా ఎస్పీ నితికా పంత్ తెలిపారు. ప్రత్యేక పరీక్ష నిర్వహించి 157 మంది విద్యార్థులను శిక్షణకు ఎంపిక చేసినట్లు వెల్లడించారు. ఎంపికైన అభ్యర్థులకు మూడు నెలల పాటు వసతితో కూడిన ప్రత్యేక శిక్షణ అందించనున్నట్లు పేర్కొన్నారు యువతలోని శక్తిసామర్థ్యాలను వెలికితీసి,వాటిని సద్వినియో గం చేసుకునేలా ప్రోత్సహించడంతో పాటు వారిని సన్మార్గంలో నడిపించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఎస్పీ వివరించారు. పోలీసు ఉద్యోగాలపై ఆసక్తి ఉన్న యువతకు సరైన మార్గదర్శకత్వం, నాణ్యమైన శిక్షణ అందించడం ద్వారా ఉద్యోగ అవకాశాలను మెరుగుపరచడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు.శిక్షణకు ఎంపికైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని క్రమశిక్షణతో సాధన చేయాలని, నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించే దిశగా కృషి చేయాలని ఎస్పీ సూచించారు.
Reporter
వాస్తవ గమ్యం