Sunday, 13 September 2026 07:01:28 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

సీపీఐ మందమర్రి మండల నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

Date : 10 July 2026 04:54 PM Views : 230

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : సీపీఐ మందమర్రి మండల నూతన కమిటీని శుక్రవారం స్థానిక ఏఐటీయూసీ కార్యాలయంలో జరిగిన మండల సమితి సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా సమితి సభ్యులు కాదండి సాంబయ్య అధ్యక్షతన జరిగిన సమావేశానికి సీపీఐ మంచిర్యాల జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ ముఖ్య అతిథిగా హాజరై పార్టీ నిర్మాణం, ప్రజా ఉద్యమాల బలోపేతంపై దిశానిర్దేశం చేశారు.సమావేశంలో 13 మంది సభ్యులతో కూడిన మండల కార్యవర్గం, 21 మంది సభ్యులతో కూడిన మండల కౌన్సిల్‌ను ఏకగ్రీవంగా ఆమోదించి నూతన మండల కమిటీని ప్రకటించారు. మండల కార్యదర్శిగా వనం సత్యనారాయణ, సహాయ కార్యదర్శిగా తాళ్లపల్లి వీరయ్య, కోశాధికారిగా బండారి రాజేశం, మండల ఆర్గనైజింగ్ కార్యదర్శిగా రోడ్డ నరేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా రామడుగు లక్ష్మణ్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలను సమీకరిస్తూ పోరాటాలను మరింత ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, యువత, మహిళల సమస్యల పరిష్కారానికి సీపీఐ నిరంతరం పోరాడుతుందని తెలిపారు. నూతన కమిటీ సభ్యులు పార్టీ సిద్ధాంతాలను గ్రామ గ్రామానికి తీసుకెళ్లి పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఇప్పకాయల లింగయ్య, జిల్లా సమితి సభ్యులు మిట్టపల్లి పౌలు, నక్క వెంకట్‌స్వామి, మామిడి గోపి, మహిళా నాయకురాలు రోడ్డ తిరుమలతో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

BAIRY RAVINDAR

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: