Friday, 11 September 2026 02:53:24 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

సీఎంఆర్ బకాయిలను తక్షణమే పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్ వి. రాములు

అదనపు కలెక్టర్ వి. రాములు

Date : 23 July 2026 07:04 PM Views : 59

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : జిల్లాలో పెండింగ్‌లో ఉన్న కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) బకాయిలను తక్షణమే పూర్తి చేసి ప్రభుత్వానికి అప్పగించాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. రాములు రైస్ మిల్లుల యాజమాన్యాలకు ఆదేశించారు.గురువారం జన్నారం మండలం పొనకల్ గ్రామంలోని శ్రీ శివసాయి రాఘవేంద్ర రైస్ మిల్లు, మర్రిగూడలోని రాజరాజేశ్వరి రైస్ మిల్లు, దండేపల్లి మండలం లింగాపూర్‌లోని శ్రీ కృష్ణ అగ్రో ఇండస్ట్రీస్, పెద్దపేటలోని భవాని ఇండస్ట్రీస్, కన్నెపల్లిలోని వెంకటేశ్వర పీబీఆర్‌ఎం, రాధాకృష్ణ ఇండస్ట్రీస్ రైస్ మిల్లులను తహసీల్దార్లతో కలిసి పరిశీలించారు. అనంతరం అధికారులతో సీఎంఆర్ పెండింగ్‌పై సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా 2025–26 వానాకాలం, యాసంగి సీజన్‌లకు సంబంధించిన సీఎంఆర్ బియ్యం పురోగతిని సమీక్షించిన అదనపు కలెక్టర్, గడువులోగా సీఎంఆర్‌ను పూర్తి చేయని రైస్ మిల్లుల నుంచి ధాన్యాన్ని మెరుగైన పనితీరు కనబరిచే ఇతర మిల్లులకు తరలించే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం జన్నారం, దండేపల్లి తహసీల్దార్ కార్యాలయాలను సందర్శించి ఎస్‌ఐఆర్ ప్రక్రియ పురోగతిని సమీక్షించారు. సాదాబైనామా, భూ భారతి, రెవెన్యూ సదస్సుల దరఖాస్తుల స్థితిగతులను పరిశీలించి, 60 రోజులకు పైగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను ప్రాధాన్యతతో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.అలాగే ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్‌ను వేగవంతం చేసి, పెండింగ్‌లో ఉన్న అన్ని పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జన్నారం, దండేపల్లి మండలాల తహసీల్దార్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

KAGITHAPU SRINIVAS

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: