Friday, 11 September 2026 02:54:43 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

ఇందిరమ్మ ఇళ్లపై కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యమా..?

పేదల ఇంటి కలకు గండి..!

Date : 22 July 2026 12:29 PM Views : 272

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : తిర్యాని: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలంలోని చెలిమెల కొలం గుడా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమైన తొలి దశలోనే నిలిచిపోయాయి. పునాదులు వేసిన తర్వాత నెలలు గడుస్తున్నా నిర్మాణాలు ముందుకు సాగకపోవడంతో లబ్ధిదారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో పునాదుల్లో నీరు నిలిచి పనులు పూర్తిగా నిలిచిపోయాయి.గ్రామస్థుల కథనం ప్రకారం, కొంతమంది కాంట్రాక్టర్లు నిర్మాణాలను మధ్యలోనే నిలిపివేసి అసంపూర్తిగా వదిలేశారని ఆరోపిస్తున్నారు. దీంతో నిరుపేదల సొంతింటి కల నెరవేరక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు వాపోతున్నారు. నిర్మాణ పనులపై కాంట్రాక్టర్లకు ఎలాంటి జవాబుదారీతనం లేకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిర్మాణాల పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా ఏఈని నియమించినప్పటికీ, క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కనిపించడం లేదని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు.ఈ విషయంపై తిర్యాని ఎంపీడీవోను వివరణ కోరగా, కాంట్రాక్టర్లను పలుమార్లు సంప్రదించినప్పటికీ వారు స్పందించడం లేదని తెలిపారు. ఇళ్ల నిర్మాణాలు పూర్తికాని లబ్ధిదారులు నేరుగా తమ కార్యాలయానికి ఫిర్యాదు చేయాలని, అందిన ఫిర్యాదులను పరిశీలించి జిల్లా కలెక్టర్‌తో పాటు ఉన్నతాధికారులకు నివేదిస్తామని, అనంతరం నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.ప్రభుత్వం నిరుపేదలకు సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పథకం క్షేత్రస్థాయిలో నిర్లక్ష్యానికి గురికాకుండా నిలిచిపోయిన నిర్మాణాలను వెంటనే పునఃప్రారంభించి, బాధ్యులపై చర్యలు తీసుకుని లబ్ధిదారులకు న్యాయం చేయాలని గ్రామస్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

MULAMATAM SHIVA PRASAD

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :