Monday, 26 October 2026 03:37:51 PM
# కలెక్టరేట్‌లో ఘనంగా మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు # గుండి బ్రిడ్జిసమస్య పరిష్కారం కోసం యువత సైకిల్ యాత్ర ప్రారంభం # గుండి బ్రిడ్జి సాధనకై యువత సైకిల్ యాత్ర 20 ఏళ్ల సమస్య పరిష్కారమే లక్ష్యం # ఈ నెల 26న జిల్లాలో విద్యాసంస్థలకు స్థానిక సెలవు రెసిడెన్షియల్ పాఠశాలలకు మినహాయింపు # ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను బేషరతుగా రద్దు చేయాలి # జాఫర్‌నగర్ డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి # సెంట్రల్ లైబ్రరీలో కొమురం భీం జయంతి వేడుకలు # మంచిర్యాలలో శాంతిభద్రతలను పరిరక్షించాలి # రాళ్లవాగు బ్రిడ్జి పనులతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేయాలి # విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు జిల్లా పోలీస్ యంత్రాంగం ఘన నివాళి # రావణ దహనానికి పటిష్ఠ పోలీసు బందోబస్తు # కిష్టంపేట గ్రామంలో భక్తిశ్రద్ధలతో మహా చండీ హోమం నిర్వహణ # ప్రమాదవశాత్తు బావిలో పడిన యువ రైతు మృతి. # భీమారం శ్రీ సాయి యూత్ దుర్గా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో చండీ హోమం # సద్దుల బతుకమ్మ సంబరాల్లో విషాదం.. యువతి మృతి # రామలీల కార్యక్రమానికి మంత్రి వివేక్‌కు ఆహ్వానం # ఆదిల్పేట్‌లో ఘనంగా బాల్క సుమన్ పుట్టినరోజు వేడుకలు # గిరిజన పోరాట యోధుల జయంతి ఉత్సవాలకు ఆహ్వానం # ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో రోడ్లు, డ్రైనేజీ పనుల పరిశీలన # బతుకమ్మ పూలతో కళకళలాడిన ఆసిఫాబాద్ మార్కెట్

జూనియర్ అథ్లెటిక్స్‌లో రెబ్బెన విద్యార్థి ప్రతిభ

రాష్ట్రస్థాయి పోటీలకు ఊరడి అంజన్న ఎంపిక

Date : 18 September 2026 07:03 PM Views : 123

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌ సెలక్షన్స్‌లో రెబ్బెన జెడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థి ఊరడి అంజన్న ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలో ఇటీవల నిర్వహించిన జిల్లాస్థాయి పరుగు పందెం పోటీల్లో పదో తరగతి విద్యార్థి ఊరడి అంజన్న 600 మీటర్ల విభాగంలో ప్రథమ స్థానం సాధించాడు. దీంతో ఈ నెల 26వ తేదీ నుంచి వరంగల్‌లో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి జూనియర్‌ అథ్లెటిక్స్‌ పోటీలకు ఎంపికయ్యాడు. విద్యార్థి ప్రతిభను జిల్లా విద్యాశాఖ అధికారి సచ్చిదానందచారి, జిల్లా విద్యాశాఖ అధికారులు అభినందించారు. అనంతరం జెడ్పీహెచ్‌ఎస్‌ రెబ్బెన పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయరాణి ఆధ్వర్యంలో శుక్రవారం అంజన్నను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించి తమకు ఇష్టమైన రంగంలో ముందుకు సాగాలని అన్నారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని పేర్కొన్నారు. పాఠశాల విద్యార్థి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడం పాఠశాలకు గర్వకారణమన్నారు. అంజన్నకు శిక్షణ అందించిన పీడీ సత్యనారాయణను ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో సీనియర్‌ ఉపాధ్యాయులు మేడి చరణ్‌దాస్‌, దూడ రాజనర్సుబాబు, పాఠశాల సిబ్బంది పాల్గొని విద్యార్థిని అభినందించారు.

KOLLI SUNIL KUMAR..

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :