Sunday, 13 September 2026 07:51:26 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

న్యాయ శాస్త్ర పట్టభద్రులు శిక్షణ భృతి, న్యాయ శాస్త్ర గ్రంథాలు, ఫర్నిచర్ కొరకు దరఖాస్తు చేసుకోవాలి

Date : 24 June 2026 08:34 PM Views : 172

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల జిల్లా షెడ్యూలు కులముల అభివృద్ధి శాఖ ద్వారా 2025-26 సంవత్సరానికి జిల్లాలోని షెడ్యూల్డ్ కులములకు చెందిన న్యాయ శాస్త్ర పట్టభద్రులు శిక్షణ భృతి, న్యాయ శాస్త్ర గ్రంథాలు, ఫర్నిచర్ కొరకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి శాఖ అధికారి చాతరాజుల దుర్గాప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. 39 సంవత్సరాల లోపు న్యాయ శాస్త్ర పట్టభద్రులకు 3 సంవత్సరాల పాటు న్యాయ పరిపాలనలో శిక్షణ నిమిత్తం జిల్లాలోని లా అధికారులకు అటాచ్ చేయడం జరుగుతుందని, శిక్షణ కాలంలో నెలకు 3 వేల రూపాయల చొప్పున శిక్షణ భృతి, న్యాయ శాస్త్ర గ్రంధాలు, ఫర్నిచర్ కొనుగోలు నిమిత్తం ఒకసారి 50 వేల రూపాయలు అందించడం జరుగుతుందని తెలిపారు. అర్హత గల న్యాయ శాస్త్ర పట్టభద్రులు ఆన్ లైన్ లో EPASS-https://Telanganaepass.cgg.gov.in లో జూలై 31వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా దరఖాస్తు చేసుకోవాలని, అభ్యర్థులు భారత్ అసోసియేషన్ లో సభ్యులుగా ఉండాలని, సంవత్సర ఆదాయం గ్రామీణ ప్రాంత వాసులకు 1 లక్ష 50 వేల రూపాయలు, పట్టణ ప్రాంతాల వారికి 2 లక్షల రూపాయల ఆదాయం ఉన్నట్లు మీ -సేవా ద్వారా జారీ చేయబడిన ఆదాయం, కుల ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు నమోదు చేయాలని తెలిపారు. సంబంధిత దరఖాస్తు, పత్రాలను సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో గల జిల్లా షెడ్యూల్డ్ కులాల శాఖ కార్యాలయంలో సమర్పించాలని, ఇతర వివరాలకు కార్యాలయ పనివేళలలో సంప్రదించవచ్చని తెలిపారు.

BEERAM SHARATH CHANDHRA

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :