Sunday, 13 September 2026 07:34:25 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

​సింగరేణిలో సెగలు కక్కుతున్న 'ఫైర్ కోల్'.. ప్రాణాపాయంలో కార్మికులు!

Date : 03 May 2026 11:15 PM Views : 172

వాస్తవ గమ్యం / తెలంగాణ / పెద్దపల్లి : సింగరేణి సంస్థ పరిధిలోని ఓసిపి -III, సిహెచ్ పి (ర్ జి -2) ఏరియాలో కార్మికుల ఆరోగ్యం మరియు భద్రత గాలిలో దీపంగా మారింది. గత కొంతకాలంగా ఇక్కడ కుప్పలు తెప్పలుగా పేరుకుపోతున్న 'ఫైర్ కోల్' (మండుతున్న బొగ్గు) కారణంగా వెలువడుతున్న విపరీతమైన ధూళి, పొగతో కార్మికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ సమస్యపై సి హెచ్ పి అఖిలపక్షం ఆధ్వర్యంలో డైరెక్టర్ (ఆపరేషన్స్)కు వినతి పత్రం సమర్పించారు. మండుతున్న బొగ్గు నుంచి వచ్చే పొగ వల్ల కార్మికులు తీవ్రమైన ఊపిరితిత్తుల వ్యాధుల బారిన పడుతున్నారు. కొందరి పరిస్థితి విషమంగా మారుతోందని ట్రేడ్ యూనియన్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. 1.75 కోట్ల భారీ వ్యయంతో 2023లో ఏర్పాటు చేసిన 'డస్ట్ సెపరేషన్ సిస్టమ్'ప్రస్తుతం అలంకారప్రాయంగా మారింది. ఇది ఏమాత్రం పనిచేయకపోవడం వల్ల సమస్య తీవ్రత పెరుగుతోంది. ​ ఫైర్ కోల్ వల్ల సుమారు 16,000 బంకర్లు దెబ్బతినడమే కాకుండా, స్లో ఫీడర్లు కాలిపోతున్నాయి. దీనివల్ల బొగ్గు రవాణాకు ఆటంకం కలిగి సంస్థకు భారీగా ఆర్థిక నష్టం వాటిల్లుతోంది. వేడి బొగ్గు కారణంగా పలువురు అధికారులు, కార్మికులు గాయపడిన సందర్భాలు ఉన్నాయి.సమస్యకు శాశ్వత పరిష్కారంగా పూర్తిస్థాయిలో వాటర్ పాండ్స్ ఏర్పాటు చేయాలి.ఫైర్ కోల్‌ను ఆ పాండ్స్‌లో నింపి లిఫ్టింగ్ చేయడం ద్వారా మంటలను, పొగను నియంత్రించాలి.డస్ట్ సెపరేషన్ సిస్టమ్‌కు అవసరమైన నీటి వనరులను సమృద్ధిగా కల్పించాలి. ​యాజమాన్యం ఇప్పటికైనా స్పందించి కార్మికుల ప్రాణాలను కాపాడాలని అన్ని సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :