వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల/మందమర్రి: మండల పరిధిలోని యాపల్ గ్రామంలో ఉన్న స్మశాన వాటికకు సంబంధించిన భూమిని మున్సిపాలిటీకి కేటాయించి, అభివృద్ధి చేయాలని కోరుతూ సోమవారం (ఏప్రిల్ 13, 2026) జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్‌కు విన్నవించారు.యాపల్ స్మశాన వాటిక కమిటీ సభ్యులు అందజేసిన అర్జీపై జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. ఈ విషయంపై తక్షణమే విచారణ జరిపి, క్షేత్రస్థాయిలో ఉన్న పూర్తి వివరాలను నివేదిక రూపంలో అందజేయాలని సంబంధిత తహసీల్దార్‌ను కలెక్టర్ ఆదేశించారు. భూమి కేటాయింపు ప్రక్రియను త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. వినతిపత్రం అందజేసిన వారు వనం నరసయ్య (యాపల్ స్మశాన వాటిక అధ్యక్షులు)బోరిగం వెంకటేష్ వెంకట్ రెడ్డి నల్ల శంకర్ సాంబమూర్తి బండి శంకర్ లు పాల్గొని గ్రామస్తుల అవసరాల దృష్ట్యా స్మశాన వాటిక భూమిని మున్సిపల్ పరిధిలోకి తెచ్చి, అక్కడ కనీస సౌకర్యాలు కల్పించాలని ఈ సందర్భంగా వారు కోరారు.
Admin
వాస్తవ గమ్యం