Monday, 26 October 2026 04:31:05 PM
# కలెక్టరేట్‌లో ఘనంగా మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు # గుండి బ్రిడ్జిసమస్య పరిష్కారం కోసం యువత సైకిల్ యాత్ర ప్రారంభం # గుండి బ్రిడ్జి సాధనకై యువత సైకిల్ యాత్ర 20 ఏళ్ల సమస్య పరిష్కారమే లక్ష్యం # ఈ నెల 26న జిల్లాలో విద్యాసంస్థలకు స్థానిక సెలవు రెసిడెన్షియల్ పాఠశాలలకు మినహాయింపు # ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను బేషరతుగా రద్దు చేయాలి # జాఫర్‌నగర్ డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి # సెంట్రల్ లైబ్రరీలో కొమురం భీం జయంతి వేడుకలు # మంచిర్యాలలో శాంతిభద్రతలను పరిరక్షించాలి # రాళ్లవాగు బ్రిడ్జి పనులతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేయాలి # విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు జిల్లా పోలీస్ యంత్రాంగం ఘన నివాళి # రావణ దహనానికి పటిష్ఠ పోలీసు బందోబస్తు # కిష్టంపేట గ్రామంలో భక్తిశ్రద్ధలతో మహా చండీ హోమం నిర్వహణ # ప్రమాదవశాత్తు బావిలో పడిన యువ రైతు మృతి. # భీమారం శ్రీ సాయి యూత్ దుర్గా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో చండీ హోమం # సద్దుల బతుకమ్మ సంబరాల్లో విషాదం.. యువతి మృతి # రామలీల కార్యక్రమానికి మంత్రి వివేక్‌కు ఆహ్వానం # ఆదిల్పేట్‌లో ఘనంగా బాల్క సుమన్ పుట్టినరోజు వేడుకలు # గిరిజన పోరాట యోధుల జయంతి ఉత్సవాలకు ఆహ్వానం # ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో రోడ్లు, డ్రైనేజీ పనుల పరిశీలన # బతుకమ్మ పూలతో కళకళలాడిన ఆసిఫాబాద్ మార్కెట్

బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడిగా కేసరి అజయ్ గౌడ్

Date : 07 October 2026 04:21 PM Views : 105

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : ఆసిఫాబాద్ కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం గోలేటి గ్రామానికి చెందిన కేసరి అజయ్ గౌడ్‌ను భారతీయ జనతా యువమోర్చా (బీజేవైఎం) జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమించారు. ఈ సందర్భంగా అజయ్ గౌడ్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో జిల్లా ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ఎలుగెతి సుచిత్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతను పదవిగా కాకుండా యువతకు, ప్రజలకు సేవ చేసే అవకాశంగా భావిస్తున్నానని అజయ్ గౌడ్ అన్నారు. పార్టీ నాయకత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా క్రమశిక్షణతో, అంకితభావంతో పనిచేస్తానని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలపై గ్రామస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు కృషి చేస్తానన్నారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రజలకు చేరేలా అవగాహన కార్యక్రమాల్లో పాల్గొంటానని, యువతను సామాజిక సేవ, నాయకత్వం, దేశ నిర్మాణం వైపు ప్రోత్సహించేందుకు తన వంతు కృషి చేస్తానని అజయ్ గౌడ్ పేర్కొన్నారు. గ్రామస్థాయిలో యువత ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం పార్టీ నాయకత్వంతో కలిసి పనిచేస్తానన్నారు.

KOLLI SUNIL KUMAR..

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: