వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : ఆదివాసీ నాయకపోడ్ హక్కుల పరిరక్షణ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు,తుడుం దెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షులు గంజి రాజన్న పిలుపు మేరకు ఈ నెల 24న ఐటీడీఏ ఉట్నూర్ ముట్టడి కార్యక్రమం నిర్వహించబోతున్నారు.ఆదివాసీ నాయకపోడు హక్కుల పరిరక్షణ కమిటీ జైపూర్ మండల అధ్యక్షుడు బిస్కుల రవి జైపూర్ మండల ఆదివాసీ నాయకపోడు ప్రజలు కలిసికట్టుగా ముందుకు కదిలి ఉట్నూరు ముట్టడిని విజయవంతం చేయాలని పిలుపునివ్వడం జరిగింది.ఆదివాసీ నాయకపోడ్‌ల హక్కుల సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని,మా హక్కులను ప్రభుత్వం గుర్తించాలని,సమాజంలో సరైన స్థానాన్ని. కల్పించాలని ,పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.ఈ కార్యక్రమానికి నాయకపోడ్ సోదరులు, కమిటీ సభ్యులు,ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి పాత శివకృష్ణ,మండల ఉపాధ్యక్షులు పెద్దల తిరుపతి,ప్రచార కార్యదర్శి పళ్ల రాజు కుమార్,నాయకులు మనుబోతుల రాజు కుమార్,కూన శరత్ కుమార్ తదితరులు పాల్గొనారు.
Reporter
వాస్తవ గమ్యం