Monday, 26 October 2026 02:46:13 PM
# కలెక్టరేట్‌లో ఘనంగా మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు # గుండి బ్రిడ్జిసమస్య పరిష్కారం కోసం యువత సైకిల్ యాత్ర ప్రారంభం # గుండి బ్రిడ్జి సాధనకై యువత సైకిల్ యాత్ర 20 ఏళ్ల సమస్య పరిష్కారమే లక్ష్యం # ఈ నెల 26న జిల్లాలో విద్యాసంస్థలకు స్థానిక సెలవు రెసిడెన్షియల్ పాఠశాలలకు మినహాయింపు # ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను బేషరతుగా రద్దు చేయాలి # జాఫర్‌నగర్ డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి # సెంట్రల్ లైబ్రరీలో కొమురం భీం జయంతి వేడుకలు # మంచిర్యాలలో శాంతిభద్రతలను పరిరక్షించాలి # రాళ్లవాగు బ్రిడ్జి పనులతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేయాలి # విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు జిల్లా పోలీస్ యంత్రాంగం ఘన నివాళి # రావణ దహనానికి పటిష్ఠ పోలీసు బందోబస్తు # కిష్టంపేట గ్రామంలో భక్తిశ్రద్ధలతో మహా చండీ హోమం నిర్వహణ # ప్రమాదవశాత్తు బావిలో పడిన యువ రైతు మృతి. # భీమారం శ్రీ సాయి యూత్ దుర్గా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో చండీ హోమం # సద్దుల బతుకమ్మ సంబరాల్లో విషాదం.. యువతి మృతి # రామలీల కార్యక్రమానికి మంత్రి వివేక్‌కు ఆహ్వానం # ఆదిల్పేట్‌లో ఘనంగా బాల్క సుమన్ పుట్టినరోజు వేడుకలు # గిరిజన పోరాట యోధుల జయంతి ఉత్సవాలకు ఆహ్వానం # ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో రోడ్లు, డ్రైనేజీ పనుల పరిశీలన # బతుకమ్మ పూలతో కళకళలాడిన ఆసిఫాబాద్ మార్కెట్

గిరిజన పోరాట యోధుల జయంతి ఉత్సవాలకు ఆహ్వానం

Date : 18 October 2026 02:20 PM Views : 70

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : కొమరం భీమ్,ఆసిఫాబాద్,గిరిజన పోరాట యోధులు కోమురం భీం,ఎడ్ల కొండు జన్మస్థలమైన రౌటసంకేపల్లిలో ఈ నెల 22న నిర్వహించనున్న జయంతి ఉత్సవాలకు హాజరు కావాలని మాజీ ఎంపీపీ, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అరిగెల మల్లికార్జున్ యాదవ్‌ను నిర్వాహకులు ఆహ్వానించారు. ఈ మేరకు ఆదివారం జిల్లా కేంద్రంలోని ఆయన కార్యాలయంలో పంచాయతీ రాయి సెంటర్, గిరిజన సంఘాల నాయకులు ఆహ్వాన పత్రికను అందజేశారు.గిరిజన పోరాట యోధుల చరిత్ర, త్యాగాలను స్మరించుకుంటూ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు సుంకరి పెంటన్న, మున్నూరు కాపు సంఘం జిల్లా యువజన అధ్యక్షుడు గాజుల రాజేంద్రప్రసాద్, కుమురం భీం కుటుంబ సభ్యులు కుమురం సీతారాం, రాము, వెంకటేష్, ఎడ్ల కొండు వారసుడు ఎడ్ల బక్కయ్య, కొలం సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆత్రం భీమ్రావు, ఆర్జేఎస్‌ఎస్ ప్రధాన కార్యదర్శి మడావి గుణవంతరావు, కార్యనిర్వాహక వైస్ చైర్మన్ వై. రాజేష్, కొమురం పాండు, ఆత్రం షేక్ తదితరులు పాల్గొన్నారు.

JAVADE RAJU

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :