Sunday, 13 September 2026 08:39:09 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

మహిళలు సాధికారత వైపు అడుగులు వేయాలి రాష్ట్ర సంచాలకులు ఏ. శ్రీనివాస్ రెడ్డి

Date : 04 July 2026 05:36 PM Views : 152

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి, జూన్ 04 మహిళలు నైపుణ్యాలను పెంపొందించుకుని ఆర్థిక స్వావలంబన సాధిస్తూ సాధికారత వైపు అడుగులు వేయాలని వయోజన విద్యాశాఖ రాష్ట్ర సంచాలకులు ఏ. శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అలాగే నిరక్షరాస్యత నిర్మూలనకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.వయోజన విద్యాశాఖ జిల్లా ఆధ్వర్యంలో, లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల సఖి సహకారంతో నిర్వహించిన 100 రోజుల కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు శనివారం మందమర్రిలోని సీఈఆర్ క్లబ్‌లో పరీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర సంచాలకులు ఏ. శ్రీనివాస్ రెడ్డికి నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు.అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళలు కుట్టు శిక్షణ ద్వారా పొందిన నైపుణ్యాలను పూర్తిస్థాయిలో వినియోగించుకుని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. అలాగే చదువును మధ్యలో నిలిపివేసిన మహిళలు ఓపెన్ పదో తరగతి, ఓపెన్ ఇంటర్, ఓపెన్ డిగ్రీ కోర్సులను పూర్తి చేసి ఉన్నత విద్యను అభ్యసించాలని కోరారు. చదువుకున్న మహిళలు చదువురాని వారికి స్వచ్ఛందంగా విద్యను బోధించి వారిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అనంతరం కుట్టు శిక్షణ పరీక్ష పత్రాలను ఆయన విడుదల చేశారు.వయోజన విద్యాశాఖ నిజామాబాద్ జిల్లా డైరెక్టర్ పురుషోత్తం నాయక్ మాట్లాడుతూ, మంచిర్యాల జిల్లాలో జిల్లా కలెక్టర్, అధికారుల సహకారంతో ఏర్పాటు చేసిన కుట్టు శిక్షణ కేంద్రాలు 100 రోజుల పాటు విజయవంతంగా కొనసాగాయని తెలిపారు. మహిళలను సాధికారత వైపు నడిపించడంలో కుట్టు శిక్షణ కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు.మంచిర్యాల ప్రాజెక్టు ఆఫీసర్ ఎం. శ్రీనివాస్ మాట్లాడుతూ, మహిళల్లో నైపుణ్యాభివృద్ధి, స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించే లక్ష్యంతో వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో పలు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమానికి సఖి క్లబ్ అడ్మినిస్ట్రేటర్, డీఆర్‌పీ బండ శాంకరి, సుమన్ అధ్యక్షత వహించగా, కుట్టు శిక్షణ కేంద్రం కోఆర్డినేటర్ ఉప్పులేటి గోపిక, ఆర్గనైజర్ ఉప్పులేటి నరేష్, శిక్షకురాలు ఉప్పులేటి శారదతో పాటు శిక్షణ పొందిన మహిళలు పాల్గొన్నారు.

BAIRY RAVINDAR

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :