వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : ఆసిఫాబాద్ ఆసిఫాబాద్ పట్టణంలోని బజార్‌వాడి రేషన్ షాపులో లబ్ధిదారులకు శుక్రవారం ఆసిఫాబాద్ మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ ఎం.డి. అహ్మద్ చేతుల మీదుగా స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వైస్ చైర్ పర్సన్ ఎండి అహ్మద్ మాట్లాడుతూ రేషన్ కార్డుల లబ్ధిదారులకు ప్రభుత్వం మరింత సులభంగా, పారదర్శకంగా సేవలు అందించేందుకు ఈ స్మార్ట్ కార్డులు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. అర్హులైన లబ్ధిదారులందరికీ కార్డులు అందజేస్తున్నామని, ఇంకా తీసుకోని వారు వెంటనే తమ పరిధిలోని రేషన్ డీలర్‌ను సంప్రదించి స్మార్ట్ రేషన్ కార్డులను పొందాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది రామారావు, రేషన్ డీలర్ అమన్, బీఆర్ఎస్ నాయకులు షబ్బీర్, షాకీర్, వార్డు మహిళలు యువకులు తదితరులు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం