Tuesday, 27 October 2026 06:18:46 PM
# రాజంపేట అభివృద్ధికి ప్రత్యేక నిధులు,సిబ్బందిని కేటాయించాలి # కలెక్టరేట్‌లో ఘనంగా మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు # గుండి బ్రిడ్జిసమస్య పరిష్కారం కోసం యువత సైకిల్ యాత్ర ప్రారంభం # గుండి బ్రిడ్జి సాధనకై యువత సైకిల్ యాత్ర 20 ఏళ్ల సమస్య పరిష్కారమే లక్ష్యం # ఈ నెల 26న జిల్లాలో విద్యాసంస్థలకు స్థానిక సెలవు రెసిడెన్షియల్ పాఠశాలలకు మినహాయింపు # ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను బేషరతుగా రద్దు చేయాలి # జాఫర్‌నగర్ డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి # సెంట్రల్ లైబ్రరీలో కొమురం భీం జయంతి వేడుకలు # మంచిర్యాలలో శాంతిభద్రతలను పరిరక్షించాలి # రాళ్లవాగు బ్రిడ్జి పనులతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేయాలి # విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు జిల్లా పోలీస్ యంత్రాంగం ఘన నివాళి # రావణ దహనానికి పటిష్ఠ పోలీసు బందోబస్తు # కిష్టంపేట గ్రామంలో భక్తిశ్రద్ధలతో మహా చండీ హోమం నిర్వహణ # ప్రమాదవశాత్తు బావిలో పడిన యువ రైతు మృతి. # భీమారం శ్రీ సాయి యూత్ దుర్గా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో చండీ హోమం # సద్దుల బతుకమ్మ సంబరాల్లో విషాదం.. యువతి మృతి # రామలీల కార్యక్రమానికి మంత్రి వివేక్‌కు ఆహ్వానం # ఆదిల్పేట్‌లో ఘనంగా బాల్క సుమన్ పుట్టినరోజు వేడుకలు # గిరిజన పోరాట యోధుల జయంతి ఉత్సవాలకు ఆహ్వానం # ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో రోడ్లు, డ్రైనేజీ పనుల పరిశీలన

కాంట్రాక్టు కార్మికులకు రూ.20 వేల లాభాల వాటా ఇవ్వాలి

Date : 08 October 2026 06:19 PM Views : 46

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : ఆసిఫాబాద్:సింగరేణి సంస్థ బెల్లంపల్లి ఏరియాలోని గోలేటి సీహెచ్‌పీ రైల్వే మెయింటెనెన్స్‌ కాంట్రాక్టు కార్మికులకు నూతన టెండర్‌ పిలిచి అందరికీ ఉపాధి కల్పించాలని, కాంట్రాక్టు కార్మికులకు రూ.20 వేల లాభాల వాటా చెల్లించాలని కోరుతూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో గురువారం బెల్లంపల్లి ఏరియా ఎస్ఓ టు జీఎం స్వామి రాజుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ బెల్లంపల్లి రీజియన్‌ అధ్యక్షుడు భోగే ఉపేందర్‌ మాట్లాడుతూ సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు, లారీ డ్రైవర్లు, క్లీనర్లు చాలీచాలని వేతనాలతో విధులు నిర్వహిస్తూ సంస్థ అభివృద్ధిలో, లాభాల సాధనలో కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. అయితే కార్మిక చట్టాలను సక్రమంగా అమలు చేయకపోవడంతో కాంట్రాక్టు కార్మికులు శ్రమదోపిడీకి గురవుతున్నారని ఆరోపించారు. గోలేటి సీహెచ్‌పీ రైల్వే మెయింటెనెన్స్‌ పనులకు వెంటనే నూతన టెండర్‌ పిలిచి ఇప్పటివరకు పనిచేస్తున్న కార్మికులందరికీ ఉపాధి కల్పించా లని,అలాగే కాంట్రాక్టు కార్మికులకు రూ.20 వేల లాభాల వాటా చెల్లించాలని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్‌ చేశారు. యాజమాన్యం వెంటనే స్పందించి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో కాంట్రాక్టు కార్మికులు చల్లూరి రాజన్న, కిరణ్‌, మహేందర్‌, వినోద్‌ తదితరులు పాల్గొన్నారు.

KOLLI SUNIL KUMAR..

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: