వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : ఆసిఫాబాద్: 22ఏ భూములకు సంబంధించిన సర్వే, రికార్డుల పరిశీలన పనులను వేగవంతం చేయాలని కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ హరిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు.గ్రామాల వారీగా భూముల విస్తీర్ణాన్ని పరిగణనలోకి తీసుకుని లక్ష్యాలను నిర్దేశించుకోవాలని సూచించారు. నిర్ణీత గడువులోగా సర్వే, రికార్డుల పరిశీలన పనులను పూర్తి చేయాలన్నారు. ప్రతిరోజూ 30 నుంచి 35 ఎకరాల వరకు సర్వే నిర్వహించేలా కార్యాచరణ రూపొందించుకోవాలని అధికారులకు సూచించారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులను తాను స్వయంగా పరిశీలిస్తానని కలెక్టర్ హరిత తెలిపారు. అధికారులు సమన్వయంతో పనిచేసి పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.
Reporter
వాస్తవ గమ్యం