వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : ప్రజా సేవే లక్ష్యంగా, మానవత్వమే మార్గంగా ఎన్నో సంవత్సరాలుగా నిరంతరం సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న దేవార వినోద్ స్వామి కి అరుదైన గౌరవం దక్కింది. సామాజిక సేవా రంగంలో ఆయన అందిస్తున్న విశిష్ట సేవలను గుర్తించి యునైటెడ్ అమెరికన్ యూనివర్సిటీ ఫర్ లీడర్షిప్ అండ్ ఎక్సలెన్స్ ఆధ్వర్యంలో “డాక్టర్ ఆఫ్ సోషల్ సర్వీస్” గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు.శనివారం పుదుచ్చేరి లోని కంబన్ కలైయరంగం ఆడిటోరియంలో నిర్వహించిన “సామాజిక నాయకులు–దార్శనికుల సమ్మేళనం–2026” కార్యక్రమంలో దేవార వినోద్ స్వామికి సామాజిక సేవలో గౌరవ డాక్టరేట్‌ను అందజేశారు.ఈ కార్యక్రమానికి యునైటెడ్ అమెరికన్ యూనివర్సిటీ డైరెక్టర్, తమిళనాడు మాజీ న్యాయమూర్తి డాక్టర్ కె. వెంకటేశన్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.ఆర్. శంపత్, ఐఏఎస్, ప్రపంచ శాంతి సంస్థ, ఐక్యరాజ్య సమితి ప్రతినిధి, ప్రపంచ బౌద్ధ సమాఖ్య అధ్యక్షులు రాయబారి డాక్టర్ పర్విందర్ సింగ్, అంతర్జాతీయ న్యాయవాది డాక్టర్ కావేటి శ్రీనివాసరావు, యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ పి. అమృతవల్లి, భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ జాతీయ కమిషనర్ డాక్టర్ కె. సుకుమార, చెన్నై మద్రాస్ హైకోర్టు మధ్యవర్తి డాక్టర్ ఎస్. సిద్ధార్థన్ తదితరులు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం