వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : కుమురంభీం జిల్లా బెజ్జూర్ మండల కేంద్రంలో చేతన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రాన్ని మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ప్రారంభించారు. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఎదురుగా ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సిడెం సకారం, బెజ్జూర్ సర్పంచ్ దుర్గం సరోజ తిరుపతి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు, యువత వేసవి సెలవులను సద్వినియోగం చేసుకుని కంప్యూటర్ విద్యను అభ్యసించాలని సూచించారు. అడ్మిషన్ల కోసం 8639460731 నంబర్‌ను సంప్రదించాలని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం