వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : గిరిజన సంక్షేమ శాఖ, ఐటీడీఏ భద్రాచలం ఆధ్వర్యంలో గిరిజన భవన్‌లో 12వ జాతీయ కోయ భాషల ప్రామాణీకరణ నిఘంటువు వర్క్‌షాప్ ఘనంగా జరుగుతోంది.అక్టోబర్ 2 నుండి 6 వరకు 5 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో ఆదిలాబాద్, కొమరం భీమ్ జిల్లాల నుంచి గోండ్వానా ప్రతినిధులు పాల్గొన్నారు.రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో గోండి,కోయ భాషలను చేర్చి అధికారిక గుర్తింపు కల్పించాలని, సంస్కృతీ సంప్రదాయాలను పరిరక్షించాలని ప్రతినిధులు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గోండ్వానా పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు కోట్నాక భీంరావు, విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు తొడసం రాజ్‌కుమార్, నాయకులు కోరేంగ సీతారాం, టేకం జైవంతరావు, మడవి లింబారావు, పంద్రా భగవంతురావు, చాహకటి దాసు తదితరులు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం