వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం బొక్కలగుట్ట గ్రామంలో నిరుపేద కుటుంబమైన సుతారి రమేష్ అదే ప్రాంతంలోని చెరువులో చేపలు పడుతూ జీవనం సాగిస్తున్నారు. మత్స్యకార సొసైటీ రుసుము 5000 రూపాయలకు గాను 3500 చెల్లించి మిగతా 1500 రూపాయలు చెల్లించలేదని మత్స్యకార సొసైటీ అధ్యక్షుడు మూడు సంవత్సరాలు సొసైటీ నుంచి బహిష్కరించారు. మత్స్యకారుడు రమేష్ ఊరు చెరువులో చేపలు పడుతూ జీవనం సాగిస్తూ కుటుంబాన్ని పోషించేవారని తెలిపారు. జీవనాధారం కోల్పోయిన మత్స్య కార్యడు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో తమ పొట్ట కొడుతున్నారని సొసైటీ అధ్యక్షులు పై ఆరోపించారు. ఆయన పేదరికం ని దృష్టిలో పెట్టుకొని తిరిగి చెరువులోకి అనుమతించలేని పక్షాన మంత్రి వివేక్ వెంకటస్వామి, జిల్లా కలెక్టర్, మత్స్యకార అధికారులకు కుటుంబ సభ్యులతో కలిసి ఫిర్యాదు చేస్తామని రమేష్ తెలిపారు.
Admin
వాస్తవ గమ్యం