వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి: తెలంగాణ వీరభద్రియ (వీర ముష్టి) నూతన మంచిర్యాల జిల్లా కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం శుక్రవారం మందమర్రిలోని పద్మశాలి భవన్‌లో కేంద్ర కమిటీ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. జిల్లా గౌరవ అధ్యక్షులు ఆగుళ్ల తిరుమలేష్, మల్యాల గోపి ఆధ్వర్యంలో నూతన కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.జిల్లా కమిటీ చైర్మన్‌గా కడారి సాగర్, ఉపాధ్యక్షుడిగా మల్యాల రవీందర్, ప్రధాన కార్యదర్శిగా దివిటి గణేష్, కోశాధికారిగా మల్యాల శ్రీనివాస్, సహాయ కార్యదర్శిగా బాణాల రవి ప్రమాణ స్వీకారం చేశారు.ఈ సందర్భంగా కేంద్ర కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ వీరభద్రియ కులానికి చెందిన విద్యార్థులు చదువుల్లో రాణించేలా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. చదువుకునే పిల్లలకు భరోసాగా నిలిచి, ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో ప్రవేశాలు కల్పించేందుకు ప్రభుత్వంతో మాట్లాడుతామని తెలిపారు. అలాగే వీరభద్రియ కులస్తులకు బ్యాంకుల ద్వారా ఎలాంటి హామీ లేకుండా వ్యక్తిగత రుణాలు అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో చెవ్వ శ్రీనివాస్, కడెం జంగయ్య, కాటేపల్లి విటల్, కాటేపల్లి గండి స్వామి, పొన్నాల శివరాజుతో పాటు వీరభద్రియ కులస్తులు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం