Saturday, 12 September 2026 04:53:12 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

వర్షాకాలం నేపథ్యంలో మందమర్రిలో ముందస్తు చర్యలు,

ప్రజలకు మున్సిపాలిటీ కీలక సూచనలు

Date : 20 June 2026 01:25 PM Views : 190

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి, జూన్ 20: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని మందమర్రి మున్సిపాలిటీ ముందస్తు జాగ్రత్త చర్యలను చేపట్టింది. ఈ మేరకు పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ కమిషనర్ శనివారం ఒక ప్రకటనలో కోరారు.వర్షాల సమయంలో అత్యవసర పరిస్థితులు మినహా ఇళ్ల బయటకు రావద్దని, లోతైన గుంతలు, కాల్వలు, మురుగు ప్రవాహ ప్రాంతాలు, వరద ముంపు ప్రాంతాలకు దూరంగా ఉండాలని సూచించారు. అలాగే విద్యుత్ తీగలు, విద్యుత్ స్తంభాలు, ఇతర ప్రమాదకర ప్రాంతాల వద్దకు వెళ్లరాదని హెచ్చరించారు. దోమల వ్యాప్తిని నివారించేందుకు ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని, శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో నివసిస్తున్న వారు ముందస్తుగా మున్సిపల్ కార్యాలయం లేదా తహసీల్దార్ కార్యాలయానికి సమాచారం అందించాలని సూచించారు.అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు మున్సిపల్ హెల్ప్‌లైన్ 1800-425-3611, ల్యాండ్‌లైన్ 08736-293611 లేదా సంబంధిత వార్డు అధికారులను సంప్రదించాలని అధికారులు తెలిపారు.వర్షాకాల అత్యవసర పరిస్థితులను. ఎదుర్కొనేందుకు విద్యుత్, నీటి సరఫరా, పారిశుద్ధ్యం, శిథిల గృహాల పర్యవేక్షణ కోసం ప్రత్యేక రెస్క్యూ బృందాలను ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ అధికారులు వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి అధికారులకు సహకరించాలని మున్సిపల్ కమిషనర్ విజ్ఞప్తి చేశారు.

BAIRY RAVINDAR

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :