Saturday, 12 September 2026 09:55:24 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

మంచిర్యాల ఆర్టీసీ డిపో ఇన్ఛార్జీగా మేనేజర్ నరేష్ కుమార్

Date : 06 July 2026 04:06 PM Views : 166

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల: మంచిర్యాల ఆర్టీసీ డిపో ఇన్‌ఛార్జి డిపో మేనేజర్‌గా కె. నరేశ్‌కుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు డిపో మేనేజర్‌గా విధులు నిర్వహించిన శ్రీనివాస్ పరకాల బదిలీ కావడంతో, ఆయన స్థానంలో కంటోన్మెంట్ డిపోలో అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్‌గా సేవలందిస్తున్న నరేశ్‌కుమార్‌ను రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నియమించింది.బాధ్యతలు స్వీకరించిన అనంతరం నరేశ్‌కుమార్ మాట్లాడుతూ, ప్రయాణికులకు మరింత నాణ్యమైన, సురక్షితమైన, సమయపాలనతో కూడిన రవాణా సేవలు అందించడమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. డిపోలో బస్సుల నిర్వహణను మరింత మెరుగుపరచడంతో పాటు, ఉద్యోగుల సమన్వయంతో సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు కృషి చేస్తానన్నారు.ప్రయాణికుల సంతృప్తే సంస్థ విజయానికి కొలమానమని పేర్కొన్న ఆయన, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రవాణా సేవలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తామని వెల్లడించారు. కొత్త ఇన్‌ఛార్జి బాధ్యతలు చేపట్టడంతో మంచిర్యాల డిపోలో సేవల నాణ్యత మరింత మెరుగుపడుతుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది.

BEERAM SHARATH CHANDHRA

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: