వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : ఆర్టీసీ కార్మిక సంఘాల ఎన్నికల పోలింగ్ ఆసిఫాబాద్ ఆర్టీసీ డిపోలో శుక్రవారం ప్రశాంతంగా కొనసాగింది.డిపో పరిధిలో మొత్తం 251 ఓట్లు ఉండగా, 227 ఓట్లు పోలయ్యాయి.దీంతో 90.44 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం 5 గంటలకు ప్రారంభమైన పోలింగ్లో కార్మికులు ఉత్సాహంగా పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో ఆసిఫాబాద్ డిపో నుంచి మొత్తం నాలుగు యూనియన్లు పోటీలో నిలిచాయి. వీటిలో రెండు యూనియన్లు కూటమిగా, మరో రెండు యూనియన్లు విడివిడిగా బరిలోకి దిగాయి. సుమారు పదేళ్ల తర్వాత ఆర్టీసీ కార్మిక సంఘాల ఎన్నికలు జరుగుతుండటంతో కార్మికుల్లో ఆసక్తి నెలకొంది. పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకో కుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో కొనసాగింది.
Reporter
వాస్తవ గమ్యం