Saturday, 12 September 2026 04:33:52 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

నస్పూర్ యూనియన్ బ్యాంక్ ఎదుట సింగరేణి విశ్రాంత ఉద్యోగుల నిరసన

సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు

Date : 20 July 2026 04:45 PM Views : 51

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల జిల్లా నస్పూర్‌లోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖ ఎదుట సోమవారం సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఎస్ బి ఐ తరహాలో యూనియన్ బ్యాంక్‌లో ఖాతాలు కలిగి ఉన్న సింగరేణి కోల్ మైన్స్ పెన్షన్‌దారులకు రూ.50 లక్షల ప్రమాద బీమా, సహజ మరణానికి రూ.10 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, 70 సంవత్సరాల లోపు యూనియన్ బ్యాంక్ ఖాతాదారులకు ప్రమాద బీమా సౌకర్యంపై బ్యాంకు అధికారులు స్పష్టమైన సమాచారం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. యూనియన్ బ్యాంక్‌లో ఖాతాలు కలిగి ఉన్న సింగరేణి పెన్షన్‌దారులకు ప్రమాద బీమా, సహజ మరణ బీమా వర్తిస్తుందా లేదా అనే విషయంపై పత్రికలు, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వాలని కోరారు.అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నస్పూర్ శాఖ మేనేజర్ బోగే సాగర్‌కు అందజేశారు.ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య, కోశాధికారి బింగి రాజేశం, కార్యదర్శి ఎన్నం శంకర్, ఆర్గనైజర్ తణుకుల మోహన్, జిల్లా నాయకులు సంగెం రాంచందర్, మేడ రాజలింగు, టీ. శ్రీహరి, ఎన్. సదాశివ, ఎండి. ఖాదర్, హుస్సేన్, ఈ. రాజనర్సు, రేకుల పర్వతాలు, బి. ఒదయ్య, ఎస్‌డీ అబ్బాస్ అలీ, బాజీరెడ్డి సురేష్, అర్వ మల్లయ్య, ఇరుకుల జనార్దన్, పి. లక్ష్మయ్య, కె. పోచయ్య, ఎస్. బాణయ్య, కె. దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు.నిరసన సందర్భంగా "రూ.50 లక్షల ప్రమాద బీమా కల్పించాలి", "సహజ మరణానికి రూ.10 లక్షల బీమా అమలు చేయాలి", "సింగరేణి విశ్రాంత ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి" అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

KAGITHAPU SRINIVAS

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :