వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : ఏ,ఐ,టి,యు,సి రాష్ట్ర నాలుగవ మహాసభలు సెప్టెంబర్ 6 నుంచి 8 వరకు కరీంనగర్లో జరుగుతాయని,కొమరం భీం జిల్లాలోని అన్ని విభాగాల కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి భోగే ఉపేందర్ పిలుపునిచ్చారు.శనివారం ఆసిఫాబాద్లోని ఆర్టీసీ డిపోలో కార్మికులతో కలిసి వాల్ పోస్టర్లు విడుదల విడుదల చేసిన అనంతరం మాట్లాడుతూ ఏఐటియుసి 1920 అక్టోబర్ 31న ఆవిర్భవించిందని నాటి నుంచి నేటి వరకు ఎన్నో పోరాటాలు త్యాగాలు చేసి 44 కార్మిక చట్టాలు సాధించిందని అన్నారు. దేశ స్వాతంత్ర ఉద్యమంలో కార్మికులను,కర్షకులను ఐక్యం చేసి పోరాటం చేసిందని,భారతదేశానికి పూర్తి స్వాతంత్రం కావాలని పోరాటం చేసిన ఏకైక కార్మిక సంఘం ఏ,ఐ,టి,యు,సి అని అన్నారు. అధికారంలో ఉన్న ప్రభుత్వం కార్మిక,కర్షక ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని,కార్మిక వ్యతిరేక అయిన నాలుగు లేబర్ కోడులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు,44 కార్మిక చట్టాలను యధావిధిగా కొనసాగించాలని అన్నారు,ప్రభుత్వ రంగ సంస్థలలో ప్రైవేటీకరణ ఎత్తివేయాలని, కనీస వేతనం 26,000,సమాన పనికి సమాన వేతనం,ఉద్యోగ భద్రత కల్పించాలని అన్నారు, ఈ,ఎస్ఐ, గ్రాట్యుటీలపై సీలింగును వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని,గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించాలని అన్నారు,ఆర్టీసీ కార్మికులపై రోజురోజుకు వేధింపులు ఎక్కువ అవుతున్నాయని,వాటిని ఆపాలని అన్నారు,ఈ మహాసభలకు ఏఐటీయూసీ జాతీయ నాయకులు పాల్గొంటారని జిల్లాలోని కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్మికులు నరేష్ ,ఆర్పిసింగ్,నారాయణ,షఫీ,హైమద్,శేఖర్ టు పాటు తదితరులు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం