వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : రెబ్బనా మండల శాఖ పి ఆర్టియు టిఎస్ సర్వ సభ్య సమావేశం స్థానిక ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కాలేజ్ లో రెబ్బెన మండల అధ్యక్షులు బత్తుల సదానందం అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పి ఆర్ టి యు టీఎస్. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షులు ఏటుకూరి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి సునర్కర్ అనిల్ కుమార్ ,గౌరవ అధ్యక్షులు యు ఎన్ చారి హాజరై పెండింగ్ లో ఉన్న ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని, పెండింగ్ లో ఉన్న డి ఏ లు ,పీఆర్సీ వెంటనే ప్రకటించాలని, కేజీబీవీలలో అప్ గ్రేడ్ అయిన చోట అవసరమయిన పోస్టులు వెంటనే మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది.అదే విధంగా ఈ సమావేశంలో రెబ్బెన మండల శాఖ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది.మండల శాఖ అధ్యక్షులుగా గాజుల రవీందర్, ప్రధాన కార్యదర్శి గా బత్తుల సదానందం, అసోసియేట్ అధ్యక్షులుగా వేమునూరి భాస్కర్ ,మహిళా అసోసియేట్ అధ్యక్షులుగా.హిమబిందు, ఉపాధ్యక్షులుగా చల్లూరు రాజన్న,మార సాయి కృష్ణ,మహిళా ఉపాధ్యక్షులుగా పెన్నెపు ప్రశాంతి,జాదవ్ ప్రతిభ, కార్యదర్శులుగా పెద్ది సంపత్ ,కె భాస్కర్, మహిళా కార్యదర్శులుగా డి గురువంత, వనిత,సోషల్ మీడియా మండల కో ఆర్డినేటర్ గా బి. శ్రీనివాస్ ,జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ గా సూరినేని ప్రసాద్ ,అశోక్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ఖాదర్ ప్రకటించారు. ఈ కార్యక్రమానికి మండల, జిల్లా,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు,రెబ్బెన మండల ఉపాధ్యాయులు తదితరులు హాజరు అయ్యారు.
Reporter
వాస్తవ గమ్యం