Sunday, 13 September 2026 06:58:54 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

ఓట్ల సర్వే నిబంధనల ప్రకారం జరగాలి.

టిఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు కలగూర రాజ్ కుమార్.

Date : 16 July 2026 03:47 PM Views : 108

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆదిలాబాద్ : చెన్నూర్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు వారి కుటుంబ సభ్యుల ఓట్లను లక్ష్యంగా చేసుకుని తొలగించే ప్రక్రియ జరుగుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని బి ఆర్ ఎస్ మాజీ భీమారం మండల పార్టీ అధ్యక్షులు కలగూర రాజకుమార్ అన్నారు.ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం బి ఎల్ ఓ లు ప్రతి ఓటర్ ఇంటికి వెళ్లి హౌస్ టు హౌస్ సర్వే నిర్వహించి, అవసరమైన ఫారాలు నింపించి, వాటికి సంబంధించిన రిసీవ్డ్ కాపీని ఓటర్లకు అందజేయాల్సి ఉంది. అయితే భీమారం గ్రామ పంచాయతీతో పాటు పలు గ్రామాలలో ఈ నిబంధనలు అమలు కావడం లేదని ఆరోపించారు.అధికారులకు ఫిర్యాదు చేసిన తర్వాత మాత్రమే ఎన్యుమరేషన్ ఫారాలు ఇవ్వడం జరుగుతోందని, కొన్ని చోట్ల కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ బి ఎల్ ఎ లకు మాత్రమే ఫారాలు అందించి, ఇతర రాజకీయ పార్టీల బి ఎల్ ఎ లకు సమాచారం ఇవ్వడం లేదని విమర్శించారు.భీమారం గ్రామ పంచాయతీలో బిఎల్ఓ లను ఒకేచోట కూర్చోబెట్టి ప్రజలను అక్కడికే రమ్మని చెప్పడం, వచ్చిన ఓటర్లతో నిర్లక్ష్యంగా, అనుచితంగా ప్రవర్తించడం జరుగుతోందని పలువురు ఓటర్లు తమ దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. “చేసుకుంటే చేసుకోండి, లేకపోతే లేదు” అనే విధంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే దీనిపై రాజకీయ జోక్యం ఉందనే అనుమానాలు బలపడుతున్నాయని పేర్కొన్నారు.గడువు పొడిగించిన నేపథ్యంలో బి ఎల్ ఓ లు ప్రతి ఇంటికి వెళ్లి విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే బి ఆర్ ఎస్ పార్టీ తరఫున ఎన్నికల సంఘానికి అధికారికంగా ఫిర్యాదు చేస్తామని కలగూర రాజకుమార్ హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ధర్మారం సర్పంచ్ దాసరి మణి దీపక్, మాజీ వైస్ ఎంపీపీ జనంపల్లి సమ్మయ్య, సీనియర్ నాయకులు చిప్ప పురుషోత్తం, సూరం లచ్చన్న, యువ నాయకులు కుంబ్రే బబ్లు, మాజీ వార్డు సభ్యుడు పూజారి కృష్ణ, ఆరెపల్లి రాజబాబు, చకినారపు రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

MANTHRI GAJANAND

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: