Wednesday, 29 July 2026 03:54:58 PM
# అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ – పచ్చని ఎదులపాడ్ నిర్మాణమే లక్ష్యం # కీ॥శే. శ్రీ సంత్ కుమ్ర దేవ్ రావు మహారాజ్ మాడిస్ పూజలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క # నీట్ పేపర్ లీకేజీ బాధిత విద్యార్థులకు కొవ్వొత్తుల ర్యాలీలో నివాళి # మద్యం మత్తులో బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటన # కోదండ రామాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తుల ప్రత్యేక పూజలు # *మాజీ ఎమ్మెల్యే ఆత్రంసక్కు చొరవతో షేడ్ నిర్మాణానికి భూమిపూజ* # *ఆశ్రమ పాఠశాలలో స్మాట్ బోర్డ్ ప్రారంభించిన స్థానిక సర్పంచ్ జనేరావు. # కేటీఆర్ జన్మదినం.. సేవా కార్యక్రమాలతో బీఆర్ఎస్ నేతల వినూత్న వేడుకలు # ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ గడువులోగా పూర్తి చేయాలి: # అభివృద్ధి పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలి: # సీఎంఆర్ బకాయిలను తక్షణమే పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్ వి. రాములు # జర్నలిస్టుల హక్కుల రక్షణే టీజేఏ దేయం # ప్రజల అభిమానాన్ని చూరగొన్న ధారావత్ శంకర్ నాయక్‌కు ఘన సన్మానం – భావోద్వేగ వీడ్కోలు* # ప్రజాస్వామ్యం మీద గౌరవం లేని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.

నిర్లక్ష్యపు నీడలో జైపూర్‌ బస్టాండ్‌!

Date : 12 May 2026 09:55 PM Views : 786

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : జైపూర్‌ మండల కేంద్రంలోని బస్టాండ్‌ ప్రాంతంలో కనీస సౌకర్యాలు లేక ప్రయాణికులు నరకయాతన అనుభవిస్తున్నారు. పారిశ్రామిక కేంద్రంగా వెలుగొందుతున్నా, ప్రయాణికులు తలదాచుకోవడానికి నిలువ నీడ లేకపోవడంతో తీవ్ర ఎండలకు తట్టుకోలేక పలువురు సొమ్మసిల్లి పడిపోతుండటం స్థానికులను కలచివేస్తోంది. దీనికి తోడు, ఓ వ్యక్తి బస్టాండ్‌ సమీపంలోని ఫుట్‌పాత్‌ను కబ్జా చేయడంతో సామాన్యుల రాకపోకలకు మరింత ఆటంకం కలుగుతోందని, అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామాల్లో పర్యటించే సమయంలో చిన్న ప్లాస్టిక్‌ కవర్‌ కనిపిస్తేనే పంచాయతీ కార్యదర్శులకు కఠిన ఆదేశాలు జారీ చేసే జిల్లా అధికారులకు, నడిబొడ్డున కనిపిస్తున్న ఈ కబ్జాలు, ప్రయాణికుల దుస్థితి ఎందుకు కనబడటం లేదని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. మండల కేంద్రంలోనే అన్ని శాఖల కార్యాలయాలు ఉన్నా, అధికారులు నిత్యం ఇటే వెళ్తున్నా.. కళ్లముందున్న సమస్యను పట్టించుకోకపోవడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా యంత్రాంగం స్పందించి అక్రమ కబ్జాలను తొలగించి, ప్రయాణికులకు నీడ కల్పించాలని కోరుతున్నారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: