వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన సెమినార్‌లో సిఐటియు జాతీయ కోశాధికారి సాయిబాబు మాట్లాడారు. కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను ఎదుర్కొంటూ నాలుగు లేబర్ కోడ్స్ రద్దు కోసం ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. ఎనిమిది గంటల పనిదినం, కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత వంటి హక్కుల కోసం పోరాటాలు కొనసాగించాలని పిలుపునిచ్చారు.కార్మికుల హక్కులపై జరుగుతున్న అణచివేతను ఖండిస్తూ, దేశవ్యాప్తంగా కొనసాగుతున్న పోరాటాలకు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు, ప్రతినిధులు పాల్గొన్నారు.
Admin
వాస్తవ గమ్యం