Saturday, 12 September 2026 07:59:01 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీల మోసపూరిత మాటలు నమ్మకండి.

హెచ్‌ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు తిప్పారపు సారయ్య

Date : 13 May 2026 01:24 PM Views : 1033

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : సింగరేణి కార్మికులను ఐఎన్‌టీయూసీ,ఏఐటీయూసీ సంఘాలు తమ అసత్య ప్రచారాలతో తప్పుదోవ పట్టిస్తున్నాయని, వారి మాటలను నమ్మవద్దని హెచ్‌ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు తిప్పారపు సారయ్య పిలుపునిచ్చారు. మంగళవారం సాయంత్రం శ్రీరాంపూర్ ఏరియా సిసిసిలోని హెచ్‌ఎంఎస్ కార్యాలయంలో జరిగిన "జగన్ పార్టీ" (విభాగం) సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా సారయ్య మాట్లాడుతూ, 2023 ఎన్నికల తర్వాత గెలిచిన సంఘాలు కార్మికులకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కాయని విమర్శించారు.ముఖ్యంగా మెడికల్ బోర్డు నిర్వహించకపోవడం.మారుపేర్ల క్రమబద్ధీకరణ ప్రక్రియ ఆగిపోవడం.ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న విజిలెన్స్ కేసులు పరిష్కరించకపోవడం.కార్మికులపై పడుతున్న భారీ ఇన్‌కమ్ టాక్స్ భారాన్ని తగ్గించడంలో విఫలం కావడం.కొత్త బొగ్గు గనుల ఏర్పాటుపై నిర్లక్ష్యం వహించడం.రాష్ట్ర ప్రభుత్వం సంస్థకు చెల్లించాల్సిన ₹51 వేల కోట్ల బకాయిలపై నోరు మెదపకపోవడం.అసత్య ప్రచారాలను మానుకోవాలి అని అన్నారు.గత రెండున్నరేళ్లుగా పైరవీలతో కాలక్షేపం చేసిన గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు.ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండటంతో యాజమాన్యం తమ డిమాండ్లకు ఒప్పుకుందని అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయి" అని ఆయన మండిపడ్డారు. ఒకవేళ నిజంగానే యాజమాన్యం డిమాండ్లను అంగీకరిస్తే, సింగరేణి సీఎండీ లేదా డైరెక్టర్లు అధికారికంగా ప్రెస్ మీట్ పెట్టి ఆ విషయాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు. కేవలం మంత్రులకు వినతి పత్రాలు ఇచ్చి, సమస్యలు తీరిపోయాయని చెప్పడం కార్మికులను వంచించడమేనని పేర్కొన్నారు.సింగరేణిలో సమస్యల పరిష్కారానికి 'సమ్మె' ఒక్కటే మార్గమని, ఆ దిశగా అడుగులు వేయాలని సారయ్య సూచించారు. నిజంగా కార్మికులపై చిత్తశుద్ధి ఉంటే, సింగరేణిలోని అన్ని రిజిస్టర్డ్ సంఘాలను కలుపుకొని ఐక్య పోరాటాలకు ముందుకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ​ఈ కార్యక్రమంలో హెచ్‌ఎంఎస్ నాయకులు మీసాల మహేందర్, నామాల శ్రీనివాస్, సందీప్ గౌడ్, చెవుల శ్రీనివాస్, ప్రవీణ్ కుమార్, వంశీకృష్ణ, తులా అనిల్ కుమార్, అనిల్ అడ్డూరి మరియు ఇతర కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: