వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : ఆసిఫాబాద్ మండలం అంకుసాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని ఎస్సీ కాలనీలో నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క శనివారం భూమిపూజ నిర్వహించారు.ఎస్సీ కాలనీలో సరైన రోడ్డు సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో నూతన సీసీ రోడ్డు నిర్మాణానికి చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు. రోడ్డు నిర్మాణంతో కాలనీ ప్రజలకు రాకపోకలకు మెరుగైన సౌకర్యం కలుగుతుందని సుగుణక్క పేర్కొన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తోందని, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తోందని అన్నారు. ప్రజల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని సుగుణక్క తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ టేకం గంగారం,ఉప సర్పంచ్ దుర్గం లక్ష్మి , డీసీసీ ఉపాధ్యక్షులు తారీక్ ,ఆసిఫాబాద్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు రాపర్తి మురళి, గ్రామ పెద్దలు రేగుంట కేశవ్, జంగపల్లి శేఖర్, పోల్కర్ రామచందర్,దుర్గం, లింగయ్య,దుర్గం సంజీవ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాము, యూత్ కాంగ్రెస్ నాయకులు కృష్ణ,తదితరులు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం