Sunday, 13 September 2026 08:39:34 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

హట్టి ఆశ్రమ పాఠశాలలో ఆహారంపై విద్యార్థుల ఆందోళన.. ఐటీడీఏ పీవో హామీతో సద్దుమణిగిన ఉద్రిక్తత

Date : 15 July 2026 08:29 AM Views : 56

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేరామెరి మండలంలోని హట్టి ఆశ్రమ పాఠశాలలో నాసిరకం భోజనం అందించారంటూ విద్యార్థులు తీవ్ర ఆందోళనకు దిగారు. మధ్యాహ్నం వండిన అన్నం తినలేని పరిస్థితి ఉండగా, సాయంత్రం కూడా నాణ్యత లేని కూర వడ్డించడంతో విద్యార్థులు ఆకలితో పాఠశాల నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించారు.సమాచారం అందుకున్న ఆదివాసి హక్కుల పోరాట సమితి (తుడుందెబ్బ) జిల్లా అధ్యక్షుడు కోవ విజయ్ కుమార్, విద్యార్థి, మహిళా, టైగర్ సేనా నాయకులతో కలిసి పాఠశాలకు చేరుకుని విద్యార్థులను శాంతింపజేశారు. వారి సమస్యలను తెలుసుకుని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.విద్యార్థులు పాఠశాల హెచ్‌ఎం విధుల నిర్వహణ, బోధన లోపాలు, ఆహార సరుకుల నిర్వహణ, సిబ్బంది ప్రవర్తన, వాచ్‌మెన్ వ్యవహారశైలిపై పలు ఆరోపణలు చేస్తూ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హెచ్‌ఎంను మార్చడంతో పాటు సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకునే వరకు తరగతులను బహిష్కరిస్తామని హెచ్చరించారు.పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఐటీడీఏ పీవో మంద మకరందు ఫోన్ ద్వారా నాయకులతో మాట్లాడి, విద్యార్థులకు న్యాయం చేస్తామని, ఆరోపణలపై విచారణ జరిపి బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం నాయకుల చొరవతో రాత్రి సుమారు 10:30 గంటలకు విద్యార్థులకు ప్రత్యేకంగా భోజనం వండించి అందించారు. దీంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. అయితే, విద్యార్థులు చేసిన ఆరోపణలు ప్రస్తుతం వారి వాదనలుగా మాత్రమే ఉన్నాయి. ఈ ఆరోపణలపై పాఠశాల హెచ్‌ఎం లేదా సంబంధిత అధికారుల అధికారిక స్పందన ఇంకా వెలువడాల్సి ఉంది. అధికారులు సమగ్ర విచారణ నిర్వహించి వాస్తవాలను వెలికితీయాలని స్థానికులు కోరుతున్నారు.

MULAMATAM SHIVA PRASAD

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: