వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : మండల అభివృద్ధి కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఎమ్మెల్సీ దండే విఠల్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కామ్డే అనిల్ పాల్గొన్నారు. మండలంలోని గ్రామాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు, తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యం, డ్రైనేజీ తదితర సమస్యలపై అధికారులు, సర్పంచులతో సమీక్షించారు. అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేసి ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎమ్మెల్సీ సూచించారు. ప్రజల సమస్యలను సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని పరిష్కరించాలని సర్పంచులకు సూచించారు. సమావేశంలో అధికారులు, మండల సిబ్బంది, సర్పంచులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం