Sunday, 13 September 2026 08:43:53 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

మామూలు ముడితే కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యమా..?

గిరిజన గ్రామంలో నాసిరకం అంగన్‌వాడీ నిర్మాణంపై ఆరోపణలు.

Date : 13 July 2026 05:36 PM Views : 445

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలంలోని అర్జున్‌లొద్ది గ్రామంలో నిర్మిస్తున్న నూతన అంగన్‌వాడీ భవనం నాణ్యతపై గ్రామస్తులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం, "మామూలు ముడితే కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం నడుస్తుందా?" అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.గ్రామస్తుల ఆరోపణల ప్రకారం,నిర్మాణంలో నాసిరకం ఇసుకను వినియోగించడంతో పాటు సిమెంట్ తగిన మోతాదులో వేయలేదని, పిల్లర్ల నిర్మాణం కూడా నాణ్యతా ప్రమాణాలకు విరుద్ధంగా జరిగిందని చెబుతున్నారు. భవనం ప్రారంభానికి ముందే నిర్మాణ లోపాలు కనిపించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని అంటున్నారు.ఇప్పుడే భవనం పరిస్థితి ఇలా ఉంటే, రేపు ఈ భవనంలో చిన్నారులు ఉంటే వారి ప్రాణాలకు ఎవరు బాధ్యత వహిస్తారు?అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు.గిరిజన ప్రాంతాల్లో నిర్మించే ప్రభుత్వ భవనాల విషయంలో అధికారులు తనిఖీలు చేయకుండా కాంట్రాక్టర్లను వదిలేస్తున్నారా అనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. అంగన్‌వాడీ భవన నిర్మాణంపై వెంటనే సాంకేతిక విచారణ నిర్వహించి, నిర్మాణంలో లోపాలు ఉంటే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. చిన్నారుల భద్రతకు ఎలాంటి ప్రమాదం లేకుండా నాణ్యతా ప్రమాణాలతో భవనాన్ని నిర్మించాలని కోరుతున్నారు.

MULAMATAM SHIVA PRASAD

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: