వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి మేడారం లో ఆయుష్మాన్ ఆరోగ్య ఉపకేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ బుధవారం సందర్శించి గర్భిణులు, చిన్నారుల టీకాల కార్యక్రమాన్ని సమీక్షించారు. ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తల సమన్వయంతో డ్యూ లిస్ట్ ప్రకారం అర్హులందరికీ టీకాలు అందించి 100 శాతం లక్ష్యాన్ని సాధించాలని సూచించారు. కోల్డ్‌చైన్ నిర్వహణ, యూవిన్ పోర్టల్‌లో నమోదు, టీకాల అనంతర జాగ్రత్తలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్త ప్రమీల, ఆశా కార్యకర్త శంకరమ్మ, డీఎంహెచ్‌వో కార్యాలయ మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, పీహెచ్‌సీ సూపర్‌వైజర్లు విజయ, బృందా పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం